బీసీ డిక్లరేషన్ అనే కాపీ పేస్ట్ ప్రోగ్రాం చంద్రబాబు ప్రదర్శించాడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. బీసీలను నమ్మించి దగా చేసిన పార్టీ టీడీపీ. రాజ్యాంగ విలువలను ఏమాత్రం కాపాడని పార్టీ టీడీపీ. బీసీలను దగా చేసిన నాయకుల చరిత్ర తీస్తే మొదటి పేరు చంద్రబాబుది అంటూ ధ్వజమెత్తారు. సీఎం వైయస్ జగన్ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన నాయకుడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. బుధవారం ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు ఏరోజైనా మేనిఫెస్టోను అమలు చేశారా? అంటూ దుయ్యబట్టారు. బీసీలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.