బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని శాసనమండలిలో విప్ లేళ్ళ అప్పిరెడ్డి విమర్శించారు. బిసిలను మరోసారి మభ్యపుచ్చేందుకు బిసి డిక్లరేషన్ అంటూ కళ్లబొల్లి కబుర్లు చెబుతున్నారని తెలియచేశారు. వైయస్ జగన్ గారు బిసిలకు టిక్కెట్లు ఇద్దామని ప్రయత్నిస్తుంటే వైయస్సార్ సిపిలోని పలువురు నేతలను చంద్రబాబు అక్కున చేర్చుకుని బిసిలకు వ్యతిరేకంగా వారిని ఆదరిస్తున్నారని ఆరోపించారు. విశ్వబ్రాహ్మణ సంఘీయుల ఆత్మీయసమావేశం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగింది.సమావేశానికి విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్ పర్సన్ పవిత్రమురళీ కృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ..వైయస్ జగన్ గారు పేదల జీవితాలలో మార్పులు తెచ్చేందుకు అనేక సంస్కరణలు తెచ్చారు. అనేక పధకాలు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా బిసిల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నారు. విశ్వబ్రాహ్మణ సమాజానికి సంబంధించి ఎన్నో ప్రోత్సహకాలు ఇచ్చారు.బిసిలకు రాజకీయపరమైన భాగస్వామ్యం ఉంటే వారే వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపవచ్చనేది వైయస్ జగన్ గారి భావన. విశ్వబ్రాహ్మణ సంఘీయులకు శాసనమండలిలో స్దానం కల్పించాలని కూడా వైయస్ జగన్ గారు నిర్ణయించారని స్పష్టం చేశారు.175 స్దానాలలో వైయస్సార్ సిపిని గెలిపించాలనే దిశగా జగన్ గారు ముందుకు వెళ్తున్నారు. అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావాలనేది ఆయన లక్ష్యం అన్నారు.ఇందులో బాగంగా విద్య,వైద్యం అంశాలలో అనేక వేల కోట్ల రూపాయలతో నాడు-నేడు ద్వారా పనులు చేపట్టారు.31 లక్షల మందికి ఇంటి స్దలాలు ఇచ్చారు.వైయస్ రాజశేఖరరెడ్డి బాటలో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నారు.నా వల్ల మంచి జరిగిందని భావిస్తేనే నాకు ఓటు వేయండని ధైర్యంగా మీ ముందుకు వస్తున్నారు.చంద్రబాబు ప్రజలను మోసం చేసి నిత్యం జగన్ గారిపై దుమ్మెత్తి పోస్తున్నారు.ఇతర పార్టీలతో కలసి విమర్శలు చేస్తున్నారు.అభద్దాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.షర్మిల గారి ద్వారా నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు.వాటిని ప్రజలు నమ్మే పరిస్దితి లేదన్నారు.