మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 158 పారిశ్రామిక సంస్ధలు, ఏకంగా 208 ఐటీఐ, పాలిటెక్నికల్ ఇనిస్టిట్యూషన్స్‌తో కొలాబిరేషన్ ఈ రోజు జరుగుతుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం అయన మాట్లాడుతూ... ఆ సంస్ధలు ఈ కాలేజీలలో భాగమై... మన పిల్లల శిక్షణలో భాగస్వాములవుతారు. శిక్షణ ఇచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తారు. ఇది చరిత్రలో నిల్చిపోయే ఘట్టమని తెలిపారు. పీఎం పాలెం- వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌లో భవిత కార్యక్రమాన్ని సీఎం వైయస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు.