కేరళలో అడవి పంది నుంచి తప్పించుకునే క్రమంలో ఓ మహిళ (50) ప్రమాదవశాత్తు యాభై అడుగుల లోతైన బావిలో పడిపోయింది. పతనంతిట్ట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెతకడం ప్రారంభించిన పోలీసులు బావి వద్ద ఆమె అరుపులను గమనించి, రెస్క్యూ సిబ్బంది సహాయంతో సుమారు 20 గంటల పాటు శ్రమించి ఆమెను బయటకు తీశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఫైర్ అండ్ రెస్క్యూ అధికారి తెలిపారు.