జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం ప్రధాని మోదీ మొదటిసారి కశ్మీర్ వెళ్లనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా గురువారం శ్రీనగర్‌లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో జరగనున్న "వికసిత్ భారత్. వికసిత్ జమ్మూకశ్మీర్’’ కార్యక్రమానికి మోదీ హాజరవనున్నారు.