భారత్-మాల్దీవుల మధ్య మరో పరిణామం చోటుచేసుకుంది. హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నిర్వహించే విషయంలో భారత్తో ఒప్పందాన్ని పునరుద్ధరించబోమని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ప్రకటించారు.
సొంతంగానే హైడ్రోగ్రాఫిక్ సర్వేలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. కాగా చైనా నుంచి ఉచితంగా సైనిక సాయం పొందడానికి ఇరుదేశాల మధ్య రక్షణ ఒప్పందం కుదిరిన కొన్ని రోజులకే ఈ ప్రకటన చేయడం గమనార్హం.