టీడీపీ అధికారంలోకి రాగానే హిందూపురం నియోజవకర్గంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని నారా లోకేశ్ అన్నారు. గురువారం హిందూపురంలో ప్రారంభించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. హిందూపురాన్ని మోడల్ పట్నంగా తీర్చిదిద్దే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందని, లేపాక్షిలో పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకే ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత తాను వ్యక్తిగతంగా తీసుకుంటానన్నారు.