ఇజ్రాయెల్ దాడులతో చిధ్రమైన గాజాకు పెద్ద ఎత్తున సాయం అందించేందుకు అమెరికా సిద్ధపడుతోంది. ఇందులో భాగంగా గాజా తీరాన తాత్కాలికంగా ఓ పోర్టును నిర్మించనున్నట్లు సమాచారం. ఇతర మార్గాల్లో అమెరికా అందిస్తున్న సాయానికి యుద్ధం కారణంగా అవాంతరాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పోర్టు నిర్మాణం పూర్తైతే విస్తృతంగా గాజాకు సాయం అందించవచ్చని అమెరికా భావిస్తోంది.