పొన్నూరు మండలంలోని వివిధ గ్రామాల్లో పేకాట, జట్కా మట్కా , అక్రమ మద్యం, అల్లర్ల వివిధ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై ఉక్కు పాదం మోపి చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపిస్తామని పొన్నూరు రూరల్ ఎస్సై భార్గవ్ శుక్రవారం మీడియాకు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా అనుమతిలేని డిజె సౌండ్స్, డాన్స్ ప్రోగ్రాంలు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.