అసంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం ‘ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన’ స్కీమ్‌ని కేంద్రం తెచ్చింది. ఈ పథకం కింద కార్మికులు కనీసం నెలకు రూ.3000 వరకు పెన్షన్ పొందవచ్చు.
ప్రతి నెలా మాన్ ధన్ యోజనలో రూ.100 కడితే అవి లబ్ధిదారుని ఖాతాలోనే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఇది 60 సంవత్సరాల వయసు వరకు కట్టాలి. ఒకవేళ లబ్ధిదారుడు మరణిస్తే అతని భార్య లేదా కుటుంబానికి సగం డబ్బులు వస్తాయి.