ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ అన్ని రకాలుగా సిద్ధం అవుతుంది. ఇప్పటికే ఓటర్ల జాబితాపై, జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ కోసం చేపడుతున్న చర్యలపై ఎప్పటికప్పుడు
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లాల ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని దిశానిర్దేశం చేస్తున్నారు.