త్వరలో ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా కీలక విషయాలు వెల్లడించారు. కోడ్ అమల్లోకి వస్తే పోటీలో ఉండే అభ్యర్థులు,
ఏజెంట్లు, కార్యకర్తలు రూ.50 వేలకు మించి నగదు, రూ.10 వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను రవాణా చేయకూడదని తెలిపారు. స్టార్ క్యాంపెయినర్లు రూ.లక్షకు మించి నగదు తీసుకెళ్లకూడదని చెప్పారు. పరిమితికి మించితే నగదు, వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు.