సైన్స్, టెక్నాలజీలో వృద్ధితో ఆధునిక యుగం పరుగులు తీస్తున్నా వనితలకు ఒడుదొడుకులు తప్పట్లేదు. కష్టాలను ఓర్చి ముందడుగు వేసే అబలల కథలతో పాటు పరిస్థితులు వల్ల అంధకారంలోకి నెట్టబడిన మహిళల దీనగాధలూ బయటపడుతున్నాయి భద్రత, స్వేచ్ఛ,
సమానత్వం, హింస, వివక్ష ఇలా ఎన్నో అంశాలపై వీర వనిత పోరాడాల్సి వస్తుంది. అందుకే వీటన్నింటినీ ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు ఏటా మార్చి 8న మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.