రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ శుక్రవారం విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) గురువారం సమావేశమైంది.
ఈ సమావేశంలో AICC అధ్యక్షుడు ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ హాజరయ్యారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోటీ చేసే స్థానాలపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. రాహుల్ కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.