కెనడా రాజధాని ఒట్టావాలో బుధవారం అర్థరాత్రి దారుణం జరిగింది. ఆరుగురిని దుండుగులు దారుణంగా చంపేశారు. 35 ఏళ్ల మహిళ, ఆమె నలుగురు చిన్నారులు, మరో వ్యక్తిని దుండగులు హత్య చేశారు.
కుటుంబంతో కలిసి నివసిస్తున్న శ్రీలంకకు చెందిన 19 ఏళ్ల విద్యార్థి హత్యకు పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ సామూహిక హత్యను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖండించారు. ఈ హత్యను 'భయంకరమైన హింస'గా అభివర్ణించారు.