మానవ అక్రమ రవాణా ఆపరేషన్ను CBI తాజాగా ఛేదించింది. వీరిపై దేశవ్యాప్తంగా 7 సిటీలలో ఏకకాలంలో దాడులు చేసింది. యువకులకు విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని మోసగించి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతానికి తరలిస్తున్నట్లు గుర్తించింది. 24x7 RAS ఓవర్సీస్ ఫౌండేషన్, OSD Bros ట్రావెల్స్ & వీసా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అడ్వెంచర్ వీసా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల కార్యాలయాల్లో సోదాలు చేస్తోంది.