ఈనెల 17న టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దాదాపు 10 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు, జనసేన పీఏసీ ఛైర్మన్ మనోహర్ వెల్లడించారు.
ఈ సభలో ఉమ్మడి మేనిఫెస్టో, భవిష్యత్ కార్యచరణను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని తెలిపారు. రాష్ట్రానికి దశ, దిశ చూపించేలా సభ నిర్వహిస్తామని వెల్లడించారు.