మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమండ్రిలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి శివయ్య దర్శనం కోసం ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారి దర్శనానికి ముందు భక్తులు గోదావరి పుణ్య స్నానాలు చేసే వారితో పుష్కర్, సరస్వతి, విఐపి తదితర ఘాట్లు కిటకిటలాడింది.