టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. దూకుడుగా బౌండరీలు బాదుతూ పరుగులు రాబట్టాడు. 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 137 బంతుల్లో 100 పరుగుల మార్క్ చేరుకున్నాడు.టెస్టుల్లో అతనికి ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. ధర్మశాల టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 154 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa