గ్రాంట్ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో చేతి వృత్తుల జీవన ప్రమాణాలు మెరుగు పడేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని కేవీఐసీ ఛైర్మన్ మనోజ్ కుమార్ అన్నారు. శుక్రవారం హిందూపురంలోని ఎంజీఎం క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రాంట్ పథకం కింద అర్హులైన లబ్దిదారులకు యూనిట్లు అందించారు. ఖాదీ భారత్ కు చిహ్నంగా మారిందన్నారు. పీఎంఈజీపీ కింద లబ్దిదారులకు ఆర్థిక సాయం అందించామన్నారు.