అరకులోయలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. గత రాత్రి అరకులోయ మండలంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సింహాద్రి (28)ని కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.దీంతో మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. మిగిలిన వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.కాగా.. అరకులోయ మండలం గన్నెల రహదారిలో మాదల పంచాయతీ నంది వలస గ్రామం వద్ద బైక్‌లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అరకులోయ - లోతేరు రహదారిలో గల నందివలస గ్రామంలో శుక్రవారం రాత్రి జాతర జరుగుతోంది. ఆ జాతరకు వెళ్లి వస్తున్న రెండు బైక్‌లను అరకులోయ నుంచి వెళుతున్న బైక్ దమ్మగుడి సమీపంలో ఢీకొంది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు సహా నలుగురు మృతి చెందగా అక్కడికక్కడే మృతి చెందారు. ఈరోజు సింహాద్రి అనే యువకుడు మరణించాడు. మృతులు చినలబుడు ప్రాంతానికి చెందిన బురిడీ హరి (17), గొల్లూరి అమలాకాంత్ (13), లోతేరు ప్రాంతానికి చెందిన త్రినాధ్ (32 ), భార్గవ్ (4)లు గుర్తించారు. మహాశివరాత్రి పర్వదినాన ప్రమాదం చోటు చేసుకోవడం.. ఐదుగురు మృతి చెందడంతో అరకులోయ పరిసర ప్రాంతాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.