శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలో బహుజన సమాజ్ వాది పార్టీ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి నాగరాజు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి హిందీవార్ ని ఓటు వేసి ప్రజలు గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అన్నారు. బి ఎస్ పి తోనే అభివృద్ధి అని తెలిపారు.