శింగనమల నియోజకవర్గ టిడిపి నాయకులు ద్విసభ్య కమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డిపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని శనివారం ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేయాలని వారు పోలీసులకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మీనుగ రామాంజనేయులు, రంగాపురం పుల్లప్ప, జయరాం, రమణ, తుంపెర రామకృష్ణ, మేకల రాజు, నారాయణ, బొమ్మలాటపల్లి గోపాల్, తదితరులు పాల్గొన్నారు.