వాట్సాప్ సందేశాల ద్వారా దైవదూషణకు పాల్పడ్డ 22 ఏళ్ల యువకుడికి పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ కోర్టు మరణ శిక్ష విధించింది. మరో యువకుడికి జీవిత ఖైదు విధించింది.
వీరు మహ్మద్ ప్రవక్త, అతని భార్యల గురించి కించపర్చేలా ఫొటోలు, వీడియోలను క్రియేట్ చేసినట్లు కోర్టు నిర్ధారించింది. ఉద్దేశపూర్వకంగానే మతపరమైన భావాలను కించపర్చేలా ఈ మెసేజ్‌లను షేర్ చేశారని పేర్కొంది. కాగా దైవదూషణకు పాక్‌లో మరణశిక్ష విధిస్తారు.