మంత్రి అంబటి రాంబాబుకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ వైసీపీ సమన్వయకర్త అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అంబటి అసమ్మతి నాయకులు, కార్యకర్తలు శనివారం నరసరావుపేటలో అనిల్ కుమార్ను కలిశారు.
సత్తెనపల్లిలో వైసీపీ పరిస్థితిని ఆయనకు వివరించారు. మంత్రి అంబటికి సత్తెనపల్లి టికెట్ రాకుండా చూడాలని, కాదని ఆయనకే టికెట్ ఇస్తే 25 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోవడం ఖాయమని అన్నారు.