విద్యుత్తు ద్విచక్ర వాహనాల ధరలు దాదాపు పెట్రోల్ స్కూటర్లు, మోటార్‌సైకిళ్ల ధరలకే లభిస్తుండటంతో విద్యుత్తు వాహనాల అమ్మకాలు ఆశించిన స్థాయిలో పెరగడం లేదని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
దీంతో విద్యుత్తు ద్విచక్ర వాహన కంపెనీలు ధరల విషయంలో దిగివస్తున్నాయి. ఒక్కో వాహనంపై రూ.25,000 వరకు రాయితీ ఇస్తున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ తన ఎస్1 శ్రేణి స్కూటర్ల ధరను ఈ మేర తగ్గించింది. హీరో మోటోకార్ప్ అనుబంధ విడా కూడా ఇదే బాటపట్టింది.