నిరుపేద మహిళలు, వారి కుటుంబాలకు హోలీ కానుకగా ఉచిత ఎల్పీజీ సిలిండర్ ను అందించేందుకు యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద రాష్ట్రంలోని సుమారు 1.75 కోట్ల మంది లబ్ధిదారులకు రెండు ఉచిత సిలిండర్ రీఫిల్‌లను అందించడానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రూ. 2,312 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.