రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని కార్యకర్తలు, నాయకులు సమిష్టి కృషితో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మండల పార్టీ అధ్యక్షుడు శ్యామల కాశిరెడ్డి కోరారు. ఆదివారం వెలిగండ్ల మండల నాయకులతో ఆత్మీయ సమావేశం జరిగింది. కాశిరెడ్డి మాట్లాడుతూ రాబోవు నెల రోజులు చాలా కీలకమని ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై టీడీపీ విజయానికి కృషి చేయాలని కోరారు.