స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలను రేపటిలోగా వెల్లడించాలని ఆదేశించింది. ఈ మేరకు జూన్ 30 వరకు గడువు కావాలని ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది.
26 రోజులుగా ఏం చేశారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 12 సాయంత్రం 5గంటల్లో దాతల వివరాలను ఈసీకి అందజేయాల్సిందేనని, అనంతరం ఈసీ ఆ వివరాలను అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.