విజయవాడలోని లేబర్ కాలనీ మైదానములో ఈనెల 15వతేది జరుగు బహుజన భేరి మహాసభను జయప్రదం చేయాలని నియోజకవర్గ బీఎస్పీ ఇన్ ఛార్జ్ డాక్టర్ తాతపూడి ప్రభుదాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షురాలు మాయావతి, నేషనల్ కోఆర్డినేటర్ ఆకాశ్ నంద్, రాజ్యసభ సభ్యులు రాంజీ గౌతమ్ పాల్గొంటారని తెలిపారు. బహుజనుల ఐక్యతను బలంగా చాటడానికి ఈ మహాసభ నాంది పలుకుతుందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa