పాయకరావుపేట నియోజకవర్గం, పట్టణంలో జగత శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ అభయం పథకం మహిళలతో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ప్రతి నెల ప్రతి పేద కుటుంబానికి 5000 రూపాయలు నేరుగా మహిళల ఖాతాల్లో జమ అవుతుంది అన్నారు. ఈ పథకాలు పేద, బడుగు, బలహీన వర్గాల ఆశజ్యోతి ఇందిరమ్మ రోజులు గుర్తుకు తెచ్చేలా వున్నాయని పాయకరావుపేట అసెంబ్లీ కో ఆర్డినేటర్ మోర్త సింహాచలం అన్నారు. ఈ కార్యక్రమంలో చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.