చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం చిల్లకూరు ఎస్ఐ అంజిరెడ్డి సాధారణ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల వద్ద 64 లక్షల రూపాయలు నగదు, 14 సవర్ల బంగారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి బిల్లులు లేకుండా ఉన్నందున స్వాధీనం చేసుకున్నామన్నారు. సిఐ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నగదును, బంగారును ఐటీ శాఖకు తరలిస్తామని తెలిపారు.