భూమిపై నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ ప్రపంచ జనాభాలో 66 శాతం మంది నీటి ఎద్దడితో బాధపడుతున్నారు. తగిన నీటి వనరులు లేని ప్రాంతాల్లో సముద్రపు నీటి డీశాలినేషన్ తో తాగునీటిని అందించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఈ మేరకు ఎన్‌వైయూ టాండన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ పరిశోధకులు ప్రపంచ నీటి సంక్షోభాన్ని పరిష్కరించడంలో పురోగతిని సాధించారు. ఈ బృందం రెడాక్స్ ఫ్లో డీశాలినేషన్ (ఆర్ఎఫ్‌డీ) సాంకేతికత ద్వారా సముద్రపు నీటిని తాగునీటిగా మార్చవచ్చని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa