తెలుగుదేశం నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సత్తెనపల్లిలో ఔదార్యం చూపించారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు సత్తెనపల్లి ఆర్టీసీ డిపో బస్సులు వెళ్లాయి. దీంతో బస్సులు లేక ప్రయాణికులు రోడ్లపై ఎండలో పడిగాపులుగాస్తున్నారు. దీంతో కన్నా లక్ష్మీ నారాయణ తన సోంత ఖర్చులతో ఆటోలు ఏర్పాటు చేసి ప్రయాణీకులను వారి సొంత ఊళ్లకు తరలించారు. తాలుకా సెంటర్లో ఆటోలు పెట్టి ప్రయాణికులను తరలించారు. దీంతో సత్తెనపల్లి నియోజకవర్గం ప్రజలు కన్నా చర్యలను అభినందించారు.