విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు రెండవ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈనెల 12న మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఈ రైలును ట్రయల్‌గా మంగళవారం సికింద్రా బాద్ నుంచి విశాఖకు ఒకవైపునకు మాత్రమే ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈమేరకు సామర్లకోట రైల్వేస్టేషన్‌కు ఆదివారంరాత్రి దక్షిణ మధ్య రైల్వే సీపీటీఎం అధికారి ఎం.ఏల్వేందర్‌యాదవ్ నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ మేరకు ఆంధ్ర జ్యోతి సేకరించిన సమాచారం ఇలాఉంది. ఇప్పటికే విశాఖ-సికింద్రాబాద్‌ల మధ్య ఒక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రాకపోకలు సాగిస్తున్న విషయం విధితమే. ఈ రెండు పట్టణాల మధ్య ప్రయాణికుల అవసరాలను రైల్వే గుర్తించి రెండవ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలోని అభివృద్ధి పనులకు, నూతన రైళ్లకు ఈనెల 12న శ్రీకారం చుట్టనున్నందున మంగళవారం సికింద్రాబాద్- విశాఖల మధ్య ట్రయల్ రన్‌గా రెండవ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రానున్నది. అధికారికంగా రెగ్యులర్‌గా ఈనెల 13న విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు రైలు నెం. 20708 గానూ, ఈనెల 15న సికింద్రాబాద్ నుంచి విశాఖకు రైలు నెం.20707 గానూ 8 కోచ్‌లతో ఈ రెండు నగరాల మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ఈ రైళ్లు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమహేంద్రవరం, సామర్లకోటలలో ఆగనున్నాయి. గురువారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులలోనూ రాకపో కలు సాగించనున్నాయి. 20707 నంబరుగల వందే భారత్ రెండవ ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్‌లో తెల్లవారుజామున 5.05 గంటలకు బయలుదేరి 6.39కి వరంగల్ చేరుతుంది. ఖమ్మం 7.43కి చేరి కొండపల్లి రూట్ మీదుగా విజయవాడకు 9.10కి చేరుతుంది. రాజమహేంద్రవరంనకు 11.02కి చేరుతుంది. 11.43కి సామర్లకోటకి చేరి దువ్వాడ మీదుగా విశాఖకు మధ్యాహ్నం 1.50కి చేరుతుంది. 20708 నంబరు గల వందేభారత్ రెండవ ఎక్స్‌ప్రెస్ రైలు విశాఖలో మధ్యాహ్నం 2.35కి బయ లుదేరి దువ్వాడ మీదుగా సామర్లకోటకు సాయంత్రం 4.03 నిమిషాలకు చేరు తుంది. రాజమహేంద్రవరంనకు 4.38కి చేరి తిరిగి విజయవాడకు రాత్రి 6.40కి చేరుతుంది. కొండపల్లి మీదుగా ఖమ్మంనకు రాత్రి 10.03కి చేరుతుంది. వరంగల్‌కు రాత్రి 11.03కి చేరుతుంది. సికింద్రాబాద్‌కు రాత్రి 11.20కి చేరుతుంది. ఈనెల 12న లాంఛనంగా ట్రయల్ రన్ ప్రారంభించనున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు చరాక పురష్కరించుకుని సామర్లకోట, రాజమహేంద్రవరం స్టేషన్లలో ప్రయా ణికులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఈ రెండు స్టేషన్ల రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వన్‌స్టేషన్ వన్ సేల్ పేరిట స్టేషన్ ఆవరణలలో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను కూడా మంగళవారం ప్రారంభించేలా ఆదేశాలను జారీ చేశారు.