కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై షూటర్ వర్తికాసింగ్ వేసిన పరువు నష్టం పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో లక్నో బెంచ్ తీర్పు వెలువరించింది. జర్నలిస్టులు దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు స్పందిస్తూ..
పిటిషనర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారైనా, గాంధీ కుటుంబానికి చెందినవారైనా పరువు నష్టం కేసు కిందకు రాదని స్పష్టం చేసింది. మార్చి 5న తీర్పు రాగానే తాజాగా కోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు.