విజయవాడలోని కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ను సీఎం జగన్ ప్రారంభించారు. అలాగే విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గతానికి ఇప్పటికీ తేడా గమనించమని కోరుతున్నానన్నారు. ప్రతి అడుగులోనూ అభివృద్ధి అంటే ఇదీ అంటూ ప్రతి ఇంటికీ మంచి చేస్తూ అడుగులు వేస్తున్నామని చెప్పారు.