నాన్ వెజ్ ఫుడ్ అనగానే ఎవరికైనా నోరూరుతుంది. ప్రధానంగా చికెన్, మటన్, చేపలతో కూడిన ఆహారం భలే రుచిగా ఉంటుంది. దీంతో కొందరు వారానికి రెండు నుంచి మూడు సార్ల నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగది అని అంటారు.మిగతా ఆహార పదార్థాల కంటే నాన్ వెజ్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల దీర్ఘ కాలికంగా ఎనర్జీ ఉంటుంది. అయితే కొందరు వారంలో రెండు లేదా మూడు రోజుల ఉపవాసాల పేరిట నాన్ వెజ్ ను ముట్టుకోరు. ముఖ్యంగా ప్రతీ శనివారం చాలా మంది నాన్ వెజ్ జోలికి వెళ్లరు. దీనిని ధార్మిక కారణాలే కాకుండా సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అదేంటో తెలుసుకోవాలని ఉందా?సాధారణంగా శనివారం అనగానే చాలా మంది ఒక ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే తెల్లారిదే ఆదివారం సెలవు ఉంటుంది. పిల్లలకు స్కూల్ సెలవు ఉంటుంది కాబట్టి ఇంట్లో సరదాగా ఉండొచ్చని అనుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు ఆదివారం సెలవు దినం కావడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఈ తరుణంలో నాన్ వెజ్ వంటకాలను తీసుకుంటూ ఇష్టంగా తింటారు. కానీ శనివారం మాత్రం చాలా మంది నాన్ వెజ్ జోలికి వెళ్లరు.
కలియుగ దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామికి శనివారం అంటే మహా ప్రీతి. అందువల్ల ఆయన కోసం ఈ రోజు నాన్ వెజ్ జోలికి వెళ్లకుండా ఉపవాసంతో ఉంటారు. మరికొందరు శని మహాత్ముడిని పూజించడం వల్ల.. ఇంకొందరు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఆయన కోసం శనివారం నాన్ వెజ్ జోలికి వెళ్లరు. ఇక కొందరు చెబుతున్నదేంటంటే.. వారంలో ఒకరోజు కడుపు ఖాళీగా ఉంచుకునేందుకు శనివారం ను ఎంచుకున్నామంటున్నారు.అయితే శనివారం ఈ కారణాల వల్లనే కాకుండా నాన్ వెజ్ కు దూరంగా ఉండడమే మంచిదని సైన్స్ కూడా చెబుతుంది. ప్రతీ శనివారం భూమిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో వాతావరణం దాదాపు చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీంతో మనుషుల జీర్ణక్రియలో అనేక మార్పులు ఉంటాయ. దీంతో ఆరోజు ఎలాంటి హెవీ ఫుడ్ తీసుకున్నా.. అది తొందరగా డైజేషన్ కాదు. ముఖ్యంగా నాన్ వెజ్ తీసుకోవడం మరీ నష్టమని కొందరు చెబుతున్నారు. అందువల్ల శనివారం నాన్ వెజ్ జోలికి వెళ్లకుండా ఉండడం బెటరేనని చెబుతున్నారు.