హర్యానా కొత్త సీఎం నాయబ్‌సింగ్ సైనీ ఇవాళ అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనున్నారు. తమ ప్రభుత్వానికి 48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సీఎం సైనీ వెల్లడించారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హర్యానాలో బీజేపీ 41 సీట్లు ఉన్నాయి. హర్యానా లోక్‌హిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్, ఆరుగురు స్వతంత్రుల మద్దతు ఉంది. కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కొత్త ప్రభుత్వంవైపు నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.