స్టాక్ మార్కెట్లు నేడు భారీగా నష్టాల్లో ముగిసాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 906 పాయింట్లు నష్టపోయి 72,762 వద్ద ముగిసింది. నిఫ్టీ 338 పాయింట్లు పతనమై 21,997 వద్దకు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఐటీసీ (4.49%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.59%), కోటక్ బ్యాంక్ (0.44%), బజాజ్ ఫైనాన్స్ (0.33%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.01%).
టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-7.28%), ఎన్టీపీసీ (-6.67%), టాటా స్టీల్ (-5.87%), టాటా మోటార్స్ (-4.28%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-3.32%).