సత్యసాయి జిల్లాలో టీబీ రోగులకు సకాలంలో మందులు, ఆహారం, బట్టలు అందజేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్ వి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో టీబీ జిల్లా అధికారి తిప్పయ్య ఆధ్వర్యంలో అధికారులతో సమావేశం జరిగింది. కృష్ణారెడ్డి మాట్లాడుతూప్రతి ఒక్కరూ లక్ష్యాలను సాధించే క్రమంలో రోగులకు అవసరమైన సామాగ్రి అందజేయాలన్నారు.