మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వైయస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ప్రవేశపెట్టానని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్ఆర్ ఈబీసీ అనేది.. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమం కాదు..పేదరికం వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదనే మన ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చిందని చెప్పారు. వైయస్ఆర్ ఈబీసీ పేద మహిళలకు ఎంతో మేలు జరిగిందని తెలిపారు. పేదల భవిష్యత్తుపై యుద్ధానికి చంద్రబాబు కూటమి మరోసారి సిద్ధమైందని.. ఈ ఎన్నికల్లో ఓటు అనే దివ్యాస్త్రాన్ని వాళ్ల మీద జాగ్రత్తగా ప్రయోగించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇచ్చారు.