వీఆర్ఏల నుంచి వీఆర్ఓలుగా పదోన్నతి పొంది సర్వే పరీక్షలో అర్హత సాధించని 600 మంది విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ వీఆర్ఓ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఏడాదిలోగా సర్వే పరీక్ష పాస్ అవ్వాలనే నిబంధనతో వారికి ప్రొబేషన్‌ను ప్రకటించింది. కాగా, ఈ పరీక్షను ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తారు.