ఒకేరోజు 25వేల ఇళ్ల పట్టాల పంపిణీ చేసి చరిత్ర సృష్టించామని వైయస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. రాజమండ్రి సుబ్రమణ్య మైదానంలో ఎంపీ మార్గాని భరత్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. రాజమండ్రిలో ఇవాళ ఒకేరోజు 25వేల ఇళ్ల పట్టాల పంపిణీ చేసి చరిత్ర సృష్టించామన్నారు. సీఎం వైయస్ జగన్ ఒకేరోజు 25వేల ఇళ్ల పట్టాల కోసమని రూ. 300 కోట్లు విడుదల చేశారని తెలిపారు. ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లకపోతే రాజమండ్రిలో పట్టాల పంపిణీ ఎప్పుడో పూర్తయ్యేదని, ఇలాగే ఇళ్ల పట్టాల అందుకున్న గీతాంజలిని టిడిపి సోషల్ మీడియా హింసించి బలితీసుకుందని ఆయన విమర్శించారు.