వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి పోటీ చేయనున్నారు. నెల్లూరు లోక్ సభ స్థానానికి ఆయన, కోవూరు అసెంబ్లీ అభ్యర్థిగా ఆమె ఎన్నికల బరిలో దిగనున్నారు.
ఆ పార్టీలో లోక్ సభ, శాసనసభ స్థానాల నుంచి భార్యాభర్తలకు ఛాన్సివ్వడం ఇదే తొలిసారి. 2009 ఎన్నికల్లో తెలంగాణలోని మక్తల్, దేవరకద్ర అసెంబ్లీ స్థానాల నుంచి దయాకర్ రెడ్డి దంపతులు టీడీపీ తరఫున పోటీ చేశారు.