కేంద్రం తీసుకొచ్చిన సీఏఏను అమలు చేయబోమని పలు రాష్ట్రాలు ప్రకటించాయి. అయితే ఏదైనా చట్టం పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రాలు అడ్డుకునే అవకాశం ఉండదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
కాకపోతే చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావొచ్చని అంటున్నారు. కాగా సీఏఏ కోసం నేరుగా కేంద్రం తెచ్చిన వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకునేవారిని ప్రభుత్వాలు ఎలా అడ్డుకుంటాయనే ప్రశ్న తలెత్తుతోంది.