రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం గుడ్ న్యూస్ అందించింది. కరువు భత్యం (DA) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 4 శాతం DA పెంచినట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఇప్పటి వరకు DA 42 శాతం వస్తుండగా, తాజా పెంపుతో 46 శాతం DAను ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులు అందుకోనున్నారు. రాష్ట్రంలో ఏడు లక్షల మంది ఉద్యోగులు, నాలుగున్నర లక్షల మంది పెన్షనర్లు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.