రాజస్థాన్ ఉదయపూర్ కు చెందిన ప్రముఖ సంస్థ 'నారాయణ సేవా సంస్థాన్' ఆధ్వర్యంలో ఏప్రిల్ 7వ తేదీన విశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో కృత్రిమ అవయవాల కొలతల శిబిరం నిర్వహిస్తున్నట్టు సంస్థాన్ ట్రస్టీ డైరెక్టర్ దేవేంద్ర చౌబీసా తెలిపారు. శుక్రవారం దశపల్ల హోటల్లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ శిబిరంలో 1000 మందికి పరీక్షలు నిర్వహిస్తామన్నారు