ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రజలను కోరారు. పులివెందుల నియోజకవర్గంలోని సమస్యాత్మక ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాలలో ఎస్పీ పర్యటించి ప్రతి గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడాలని, పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడినా, అల్లర్లకు ప్రేరేపించిన కఠిన చర్యలు ఉంటాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa