లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్‌లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ అజయ్ ప్రతాప్ సింగ్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మకు తన రాజీనామా లేఖలు పంపించాడు. మార్చి 2018లో బీజేపీ అజయ్ ప్రతాప్ సింగ్‌ను రాజ్యసభకు నామినేట్ చేసింది